స‌న్నీ లియోన్ రాక‌తో జ‌న‌సంద్రంగా మారిన కేర‌ళ‌

0బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కి కేర‌ళ అభిమానులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ రోజు కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఇనాగ‌రేష‌న్ కోసం అక్క‌డికి వెళ్ళిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. వారి రాక‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు. వీరి ప్రేమ‌కు స‌న్నీ ఫిదా అయింది. కొచ్చి ప్ర‌జ‌లు చూపించిన ప్రేమ‌కు నేను ధ‌న్యురాలిని. వారి ప్రేమ‌ను జీవితంలో ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేను అంటూ కామెంట్ పెట్టి,ఓ వీడియోని పోస్ట్ చేసింది స‌న్నీ. ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం భూమి అనే చిత్రంలో ట్రిపి ట్రిపి అనే స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా, బాద్ షా హో చిత్రంలో పియామోర్ అనే ఐటం సాంగ్ చేస్తుంది.