ఫస్ట్ పోర్న్ చూసి ఏడ్చేసిన సన్నీలియోన్

0ఇప్పుడంటే ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కానీ ఒకప్పుడు పోర్న్ స్టార్.. కెనెడా దేశంలో పోర్న్ స్టార్ గా సన్నీలియోన్ ఎన్నో అడల్ట్ చిత్రాల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యింది. సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఆమెను తీసుకొచ్చి హిందీ హాట్ హాట్ సినిమాల్లో నటింపచేశారు. బాలీవుడ్ లో సన్నీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

తాజాగా సన్నీలియోన్ జీవితగాథ ఆధారంగా ‘కరన్ జిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇందులో స్వయంగా సన్నీలియోనే నటిస్తోంది. తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను దర్శక నిర్మాతలకు పూసగుచ్చినట్టు చెప్పి ఈ కథను సన్నీ తయారుచ చేయించింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సన్నీలియోన్ బయోపిక్ పై ఆసక్తి నెలకొంది.

తాజాగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను సన్నీలియోన్ ముందే చూసేసింది. కన్నీళ్లు ఆపుకోలేక వలవలా ఏడ్చేసిందట. ఓ ఇంటర్వ్యూలో సన్నీలియోన్ ఈ సినిమా గురించి మాట్లాడింది. సినిమాలో కనిపించే ప్రతీ సీనూ నిజమేనని.. ప్రతీ కన్నీటి బొట్టు నిజమైనదేనని.. తనదేనని వివరించింది. తనకు తానుగానే పోర్న్ స్టార్ గా మారనని వివరించింది. సన్నీ అనేది తన పేరు కాదని.. తన అన్నయ్య పేరు అని.. ఆ పేరుతోనే పోర్న్ స్టార్ గా మారి పాపులర్ అయ్యానని వివరించింది.

కాగా సినిమాకు ‘కౌర్’ అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని.. టైటిల్ లోని ఆ పదాన్ని తొలగించాలని సిక్కుమత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు.