సన్నీ లియోన్ కు అస్వస్థత!

0ఉత్తరాఖండ్ లో ‘ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే’ సీజన్-11 షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ అస్వస్థతకు గురైంది. తీవ్ర కడుపునొప్పి – గ్యాస్ట్రోఎంటరైటిస్ తో బాధపడుతోన్న సన్నీని గురువారం రాత్రి 11.30 నిమిషాలకు చిత్ర యూనిట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సన్నీ ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశముందన్నారు. ప్రయాణ బడలిక – వేడి – ఉక్కపోత వాతావరణం వల్ల సన్నీ స్టమక్ ఇన్ ఫెక్షన్ కు గురైందని మయాంక్ తెలిపారు. ఆసుపత్రిలో చేరే సమయంలో ఆమె కడుపునొప్పి – జ్వరంతో బాధపడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.

సన్నీ పార్టిసిపేట్ చేస్తోన్న ఎంటీవీ రియాల్టీ షో ‘ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే`కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ షో సీజన్ -11 షూటింగ్ ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న రామ్ నగర్ లో జరుగుతోంది. అక్కడే ఓ రిసార్ట్ లో బస చేస్తోన్న సన్నీ….షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. ఆమెతో పాటు ఈ షోలో నటిస్తోన్న రన్ విజయ్ కూడా రామ్ నగర్ షూటింగ్ లో ఉన్నాడు. అయితే గురువారం రాత్రి హఠాత్తుగా సన్నీకి కడుపునొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన కాషీపూర్ లోని బ్రిజేష్ ఆసుపత్రికి తరలించారు. అయితే సన్నీని చూసేందుకు ఆసుపత్రి దగ్గరకు ఆమె అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం సన్నీని డిశ్చార్జ్ చేసే అవకాశముందని డాక్టర్ మయాంక్ తెలిపారు.