హైదరాబాద్‌లో సన్నీలియోన్ లైవ్ పెర్ఫార్మెన్స్..

0Sunny-leone-Garuda-Vegaసన్నీలియోన్.. ఒకప్పుడు పోర్న్ స్టార్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో పెద్ద స్టార్.. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని రోజుల క్రితం కేరళలో ఓ షోరూం ఓపెనింగ్‌కి అటెండ్ అయితే ఆమెను చూసేందుకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దీంతో ఆమెకున్న క్రేజ్ దేశం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు సన్నీ హైదరాబాద్ రాబోతోంది. అంతే కాదు డ్యాన్స్ చేసి మెప్పించనుంది.

రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న గరుడ వేగ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అలరిస్తున్న ఈ అమ్మడు హైదరాబాదీల మతి పోగొట్టేందుకు సిద్ధమవుతోంది. గరుడ వేగ ఆడియో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఈ నెల 27న జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్‌కి సన్నీ హాజరై ఓ సాంగ్‌కి పెర్ఫార్మ్ చేయనుందని టాక్.