సచిన్ కు షాక్ ఇచ్చిన సన్ని లియోన్

0



Sunnyleoneభారతదేశ క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ పేరు ఎరుగని వారుండరు. అటువంటి సచిన్ కు శృంగార తార సన్నిలియోన్ ఒక అనుకోని షాక్ ఇచ్చింది. తాజాగా ఈ సెక్సీ స్టార్ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను మించిపోయింది.

ఏ విషయంలో అనుకుంటున్నారా, వీరిద్దరి పేరుతో అఫిషియల్ మొబైల్ యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సచిన్ యాప్‌ను ఇప్పటివరకు లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకోగా, సెక్సీభామ సన్నీలియోన్ యాప్‌ను 3 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట.  ఈ ఇద్దరు తారలు పాల్గొనే ఈవెంట్లకు చెందిన వీడియోలను ఈ ప్రత్యేక యాప్‌ల ద్వారా వీక్షించవచ్చు. ‘వీడియో ఆన్ డిమాండ్’ పేరిట మొబైల్ టీవీ సర్వీసులు అందిస్తున్న ఒక సంస్థ సచిన్, సన్నీ యాప్స్‌ను ఈమధ్య లాంచ్ చేసింది. సన్నీ యాప్ ద్వారా ఆమె నటించిన అశ్లీల వీడియోలు చూద్దామనుకుంటే కుదరదు.

ఆ యాప్‌తో కేవలం ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన కంటెంట్ చూసేందుకే వీలవుతుంది. అదేవిధంగా సచిన్ యాప్ ద్వారా సచిన్ తన క్రికెట్ కెరియర్ లో ఆడిన అద్వితీయమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన క్లిపింగ్స్ తో పాటు సచిన్ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోలు కూడ ఉంటాయి. భారత రత్న స్థాయికి ఎదిగిన సచిన్ కంటే సన్నిలియోన్ ఫోటోస్ చూసేవారు ఎక్కువ అంటే ఈ పోర్న్ స్టార్ నేటి యూత్ ను ఎలా షేక్ చేస్తోందో అర్ధం అవుతోంది.