కొత్త విషయాలు నేర్చుకుంటున్న సన్నీపాప

0సన్నీలియోన్ కు పరిచయ వాయ్ఖ్యలు చెప్పనక్కరలేదు. ఇప్పటికే తెలుగులో అయిటమ్ సాంగ్ లతో పాపులర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ పాట ఎంత హిట్ అయిందో కూడా తెలిసిందే.

ఇప్పుడు సన్నీలియోని తొలిసారి దక్షిణాదిన ఓ చారిత్రక చిత్రంలో నటించబోతోంది. తమిళ దర్శకుడు వడి ఉదయన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమా కోసం సన్నీ 150 రోజుల కాల్‌షీట్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఇందులోని పాత్ర కోసం మార్షల్‌ ఆర్ట్స్‌, కత్తిసాము నేర్చుకుంది ఈ చిత్రం గురించి ఆమె తాజాగా మాట్లాడారు ‘ఈ సినిమా ఓ వ్యక్తిగా, నటిగా అభివృద్ధి చెందడానికి నాకు తోడ్పడుతోంది. పూర్తిగా విభిన్నమైన సంప్రదాయాల గురించి తెలుసుకోవడం చాలా బాగుంది’అన్నారు.