స్టార్ డమ్ వచ్చాక ముఖం చాటేశాడు!

0ఆ యంగ్ హీరో స్టార్ డమ్ వచ్చాక ఎక్స్ నిర్మాతకు ముఖం చాటేశాడా? ఇది నిజమేనా? సదరు ప్రొడ్యూసర్ ఆవేదనలో నిజం ఎంత? కాస్త పరిశీలించండి ప్లీజ్! ఇదంతా ఎవరి గురించి? అంటారా.. ఆర్.ఎక్స్100 హీరో కార్తికేయ గురించే. ఈ యంగ్ హీరో స్టార్ డమ్ దొరకబుచ్చుకున్నాక ప్లేటు ఫిరాయించాడట. తాజా అలిగేషన్ ఇది.

అసలింతకీ ఏమైంది? వివరాల్లోకి వెళితే.. నటించిన తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కార్తికేయ. ఆర్.ఎక్స్ 100 నిర్మాతలకు నాలుగు రెట్లు లాభం తెచ్చింది. అయితే కార్తికేయ నటించిన తొలి సినిమా ఆర్.ఎక్స్100 కాదు…. నా సినిమా అని అంటున్నాడు ఓ నిర్మాత. ఆయన పేరు వేణు. అతగాడు తీసిన సినిమా `సుఫారి`. అందులో కార్తికేయ హీరోగా నటించాడట. అందుకు సంబంధించిన వీడియోలు లీకయ్యాయి. అయితే కార్తికేయ వెర్షన్ వేరొకలా ఉంది. “ఆ వీడియో నాపై షూట్ చేసినదే. కానీ ఆ సినిమాలో మాత్రం నేను నటించలేదు మొర్రో“ అంటున్నాడు. డెమో రీల్ షూట్ చేసి – దానిని సినిమాకి వాడుకున్నారు అంతే! నేను పూర్తి సినిమాలో నటించలేదు.. అంటూ కార్తికేయ సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇచ్చాడు. ఈ నాన్సెన్స్ ఆపండిక అంటూ సీరియస్ అయ్యాడు.

అసలింతకీ ఏది నిజం? ఏది అబద్ధం? కార్తికేయ నిజంగానే సుఫారిలో నటించలేదా? అయితే ఎందుకీ వివాదం? మునుముందు ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో అంటూ అభిమానుల్లో ఒకటే ముచ్చట సాగుతోంది. ఇదేమీ వివాదంతో ప్రచారం కాదు కదా? వివాదాలతో అగ్గి రాజుకుంటున్న వేళ నవతరం హీరో కార్తికేయ తెలివిగా వ్యవహరిస్తాడనే ఆశిద్దాం.