అంచనాలు పెంచేసిన ‘సూపర్ 30’ లుక్

0బాలీవుడ్ ప్రేక్షకులు చాలా కాలంగా – ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హృతిక్ రోషన్ చిత్రం ‘సూపర్ 30’ ఫస్ట్ లుక్ విడుదలైంది. అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉండబోతుందని పోస్టర్ చూస్తేనే అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినీ వర్గాల దృష్టితో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో దర్శకుడు వికాస్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆనంద్ కుమార్ టీచర్ గా ఉన్న సమయంలో సాధించిన ప్రగతి – అతడి పట్ల స్టూడెంట్స్ మరియు ఇతరులు ప్రవర్తించిన తీరును ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

బీహార్ లో ఆనంద్ కుమార్ టీచర్ గా ఉన్న సమయంలో సూపర్ 30 అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకువచ్చాడు. ఆ కాన్సెప్ట్ తో స్టూడెంట్స్ జీవితాలను ఎలా మార్చాడు అనేది కూడా ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలోని హృతిక్ రోషన్ లుక్ చాలా బాగుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. గతంలో హృతిక్ నటించిన ‘అగ్నిపథ్’ లుక్ కు ఆనంద్ కుమార్ గా హృతిక్ లుక్ కు దగ్గర సంబందం ఉన్నట్లుగా అనిపిస్తుంది.

నేడు ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. పోస్టర్ పై ‘అబ్ రాజా కా బేటా రాజా నహిన్ బనేగా’ అంటూ వేయడం చర్చనీయాంశం అవుతుంది. ఆ పదాలు సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంను 2019 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో మృనాల్ ఠాకూర్ – పంజక్ త్రిపాఠిలు నటిస్తున్నారు.