50 ఏండ్ల వయసులోనూ 20 ఏండ్ల యువతిలా..!

0చైనాలోని లియూ యెల్లిన్ అనే మహిళ ఐదు పదుల వయసులోనూ 20 ఏండ్ల యువతిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఆమెకు 22ఏండ్ల కొడుకు ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. వీరిద్దరిని చూసిన కొందరు ఒకానొక సందర్భంలో ప్రేమికులు అనుకొని పొరబడుతుంటారు. ముడుతలు లేని ముఖం తో ఆమె అందంగా కనిపిస్తారు. ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కఠోరమైన వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన భోజనం, సమతుల ఆహారం తీసుకుంటారు. అంతేకాదు ఆమె చలికాలంలోనూ సరస్సులో ఈత కొడుతుంటారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బరువును అదుపులో ఉంచుకునే కార్యక్రమాలు చేపడుతారు.