థగ్స్ ఐటెం : ఈసారి షీలాకి జవానీని మించి..!

0

బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు పెట్టింది పేరు కత్రీనా కైఫ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన పాటతో ఎన్నో సార్లు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ఘనత కత్రీనా కైఫ్ కు దక్కింది. ఇష్క్ సేవ.. స్వాగ్… షీలాకి జవానీ… కమలి.. పాటలు ఏ రేంజ్ లో ఊపు ఊపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటల సంగీతంతో పాటు కత్రీనా అందచందాలు – డాన్స్ లు యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరో ఐటెం సాంగ్ తో కత్రీనా దుమ్ము రేపుతోంది.

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కత్రీన కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈమె ఐటెం సాంగ్ గురించి చాలా రోజులుగా బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ గురించిన ప్రోమో విడుదల అయ్యింది. సురఇయ్య.. అంటూ సాగే ఈ పాట గతంలో వచ్చిన కత్రినా ఐటెం సాంగ్స్ అన్నింటి కంటే ఎక్కువగా ఊపు ఊపేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సురఇయ్య సాంగ్ లో కత్రీనా డాన్స్ తో పాటు సెట్ మరియు భారీ కాస్టింగ్ హైలైట్ గా నిలువబోతున్నట్లుగా టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇండియాలో పలు భాషల్లో విడుదల కాబోతున్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో బిగ్ బి అమితాబచ్చన్ కూడా నటించిన విషయం తెల్సిందే. ధూమ్ 3 చిత్ర దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నవంబర్ 8న విడుదల కాబోతున్న ఈ చిత్రం గతంలో ఉన్న రికార్డులన్నీ కూడా తూడ్చి పెట్టడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
Please Read Disclaimer