చిరంజీవి వ్యక్తిత్వం ఓ పుస్తకం

0మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి` చిత్రానికి దర్శకుడిగా అవకాశం అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే అదో కలలా ఆ ఛాన్స్ నన్నే వరించింది అని చెప్పాడు సురేందర్ రెడ్డి. ఊహించని విధంగా ఆ ఛాన్స్ వచ్చింది. కేవలం కమర్శియల్ పంథాలో సినిమాలు చేసే నాకు నిజంగా అంత పెద్ద అవకాశం వస్తుందని ఊహించలేదని ఇదివరకూ ఓ సందర్భంలో సురేందర్ రెడ్డి తెలిపారు. హిస్టారికల్ సినిమా చేసిన అనుభవం లేకపోయినా చిరు నమ్మకంతో పిలిచి అవకాశం ఇచ్చారని అన్నారు.

సైరా-నరసింహారెడ్డి స్క్రిప్టు రెడీ అవుతున్నప్పుడే.. లక్కీగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన `ధృవ` హిట్ కావడంతో అది కలిసొచ్చింది. ఆ విజయం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. చరణ్తో సురేందర్ రెడ్డి సింక్ కూడా ఈ అవకాశం రావడానికి కారణమైంది. అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సైరా వేగంగా పూర్తి చేస్తున్నాడు. జార్జియాలో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరు గురించి సూరి పలు ఆసక్తికర సంగతులు తెలిపాడు.

“మెగాస్టార్ వ్యక్తిత్వం ఒక పుస్తకం లాంటింది. ఆయనతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఎంతో జ్ఞానం పెరిగింది. ఆయన్ను చూసి నా అలవాట్లు – అభిరుచులు కూడా మార్చుకున్నా. వ్యక్తిత్వంలో మెగాస్టార్ లా ఉండాలనిపిస్తోంది. ఆయనతో పనిచేస్తుంటే సమయం తెలియడం లేదు. నిరంతరం ఆయనతో పనిచేయాలనిపిస్తోంది. ఆ ఉత్సాహం ఒక దర్శకుడికి ఎప్పుడూ ఆయన ఇస్తారు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలనుంది. అంత పెద్ద స్టార్ అయినా సింప్లిసిటీ – కూల్ గా ఉండే స్వభావం – వర్క్ పై డెడికేషన్ ఇలా ప్రతీది ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిందే. మెగాస్టార్ను నేనే డైరెక్ట్ చేస్తున్నానా? అని నమ్మలేనంతగా ఇదిగా ఉంది ఆ అనుభూతి` అన్నాడు.