నాయుడు గారి అబ్బాయిల కొత్త రూట్

0నిర్మాతగా రామానాయుడు గొప్పదనం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి.. శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కేశారు. ఆయన ఖాతాలో అటు పెద్ద సినిమాలతో పాటు.. ఇటు చిన్న సినిమాలు కూడా ఉంటాయి.

ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొడుకు సురేష్ బాబు కంటిన్యూ చేస్తుండగా.. మనవళ్లు ఇద్దరు కూడా నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలని ఫిక్స్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ నగరానికి ఏమైంది.. కేరాఫ్ కంచరపాలెం అంటూ రెండు సినిమాలు రూపొందనున్నాయి. వీటికి నిర్మాతగా ఉండేందుకు.. ఈ కుర్రాళ్లు ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీరి లెక్కల ప్రకారం.. ఈ రెండు చిత్రాలను ఒక్కోదానిని 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేస్తారట. సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న వాల్యూను బేస్ చేసుకుని.. గట్టిగా రిలీజ్ చేసేందుకు సహకరించడం ద్వారా.. 4 నుంచి 5 కోట్ల మధ్య విక్రయించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

సురేష్ సంస్థ నుంచి వచ్చిన తర్వాత సబ్జెక్టు బాగుంటే ఈ మాత్రం వసూళ్లను.. సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ చిత్రాలకు దగ్గుబాటి రానా నిర్మాతగా ఉంటాడని.. అభిమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. మరి ఈ కుర్ర హీరోలు ట్రెండ్ ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అవుతారో లేదో చూడాలి.