అదేంటి సూర్యా.. రకుల్ టాపిక్ లేదే!

0

తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా ‘NGK’ ట్రైలర్.. ఆడియో రెండూ నిన్న చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల అయ్యాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఈవెంట్ లో హీరో సూర్య దాదాపు 12 నిముషాలు మాట్లాడాడు. పనిలో పనిగా సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ మరో హీరోయిన్ రకుల్ గురించి మాట్లాడడం మర్చిపోయాడు.

సాయి పల్లవి గురించి మాట్లాడుతూ సాయి పల్లవి మంచి నటి అని.. ఎంతో సహజంగా నటిస్తుందని మెచ్చుకున్నాడు. అంతే కాదు సినిమాలో తన పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి నటిస్తుందని అన్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఛాలెంజింగ్ అని.. అయినా ఎప్పుడూ తన పాత్రను ఇంకా బెటర్ గా చేయవచ్చని ఆలోచిస్తూ ఉంటుందని చెప్పాడు. సాయి పల్లవి తన క్యారెక్టర్ ను మెరుగుపరిచేందుకు ఎలా ప్రయత్నించేది చెప్తూ సాయి పల్లవిని ఒక డాక్టర్ అని.. ఒక టీచర్ అని మెచ్చుకున్నాడు. అంతా బాగుంది కానీ ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన తీసుకురాలేదు.

దీంతో బ్యూటిఫుల్ రకుల్ అభిమానులు నిరాశచెందారట. సాయి పల్లవిని పొగడడం తప్పు కాదని.. అయితే మరో హీరోయిన్ రకుల్ గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడి ఉంటే బాగుండేదని వారి అభిప్రాయం. అభిమానులు చెప్పేది కరెక్టే కదా.. మరి ఈసారి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో.. లేక ప్రమోషనల్ ఇంటర్వ్యూలలోనో రకుల్ గురించి మాట్లాడి ఇప్పుడు డిజప్పాయింట్ అయిన వారిని సంతోషపెడతాడేమో వేచి చూడాలి.
Please Read Disclaimer