గెటప్ మార్చిన సూర్య

0తమిళ హీరో సూర్య కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. సూర్య సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతుంటాయి. ఈ మధ్య సూర్య నటించిన సినిమాలు తెలుగులో పెద్దగా విజయం సాధించకపోయినా సూర్య సినిమాలు చూసే రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం ఉన్నారు. సూర్య రీసెంట్ గా ‘NGK'( తెలుగులో నంద గోపాల కృష్ణ)సినిమాషూటింగ్ కంప్లీట్ చేసి కొత్త సినిమా మొదలుపెట్టాడు.

ఈ సినిమాకు ‘రంగం’.. ‘వీడొక్కడే’ ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ సాయేషా సెహగల్ కాగా ఆర్య మరో కీలక పాత్రలో కనిపిస్తాడు. రీసెంట్ గా ఈ సినిమాలో సూర్య లుక్ బయటకు వచ్చింది. సూర్య – మోహన్ లాల్ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో సూర్య మిలిటరీ క్రూ కట్ లో ఉన్నాడు. గత చిత్రానికి భిన్నంగా మీసాలు కూడా పెంచాడు. దీంతో సూర్య మిలిటరీ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇక అంతలోపు ‘NGK’ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి..రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్.