సూర్య తప్పుకున్నాడా?

0కోలీవుడ్ లో డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా తప్పకుండా ఎంతో కొంత లాభాలు వచ్చేలా వసూలు చేయగలదు అని కాంబినేషన్ మూవీలకు ఒక టాక్ ఉంది. ఇకపోతే సూర్య – గౌతమ్ మీనన్ కాంబినేషన్ కి కూడా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. వారి కలయికలో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మరోసారి ఈ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమవుతున్నట్లు న్యూస్ లు బాగానే వచ్చాయి.

సూర్య కూడా తన వైపు నుంచే ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సడన్ గా సూర్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఓపెన్ లెటర్ ద్వారా గౌతమ్ మీనన్ తో సినిమా చేయడం లేదని ఫైనల్ గా తప్పుకున్నట్లు కోలీవుడ్ లో వార్తలు ఊపందుకుంటున్నాయి. అందుకు కారణం విక్రమ్ తో ఇటీవల గౌతమ్ తెరక్కించిన సినిమానే అని తెలుస్తోంది. ధృవ నచ్చత్తిరమ్ అనే ఆ సినిమా అంతగా బాగోలేదేని తెలుసుకున్న సూర్య గౌతమ్ కి నో చెప్పాడట.

గత కొంత కాలంగా ఈ దర్శకుడికి పెద్దగా హిట్లు లేవు. వరుస పరాజయాలతో ఉన్నప్పుడు సూర్య అవకాశం ఇవ్వగా ఇప్పుడు అది కూడా మిస్ అయ్యింది. గతంలో వచ్చిన తమిళ్ ఘర్షణ – సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలు ఈ కాంబినేషన్ లో మంచి హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు గౌతమ్ తన శైలిని మార్చుకోకపోవడంతో కొత్తదనం ఏమి లేదని తప్పుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి..