స్టార్ హీరో 16 ఏళ్లు వెయిట్ చేశాడట

0

స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూ కడుతూ ఉంటారు. అయితే కొందరు దర్శకులతో వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎంతో ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. అయితే స్టార్ హీరో కోరుకుంటే ఏ దర్శకుడు అయినా కాస్త వెనుకో ముందో సినిమా చేస్తాడు. కాని సూర్య కోరుకున్న దర్శకుడితో చేసేందుకు మాత్రం ఏకంగా 16 సంవత్సరాలు వెయిట్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా ‘ఎన్జీకే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు సూర్య. ఈ చిత్రంకు తమిళ ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

తాజాగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో వచ్చిన ‘కాదల్ కొండెన్’ చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఒక్కసారి అయినా నటించాలని ఆశ పడ్డాను. ఆ సమయంలోనే నాతో ఒక సినిమా చేయాల్సిందిగా ఆయన్ను మొహమాటం లేకుండా అడిగాను. ఆ సమయంలో ఇద్దరు కలిసి సినిమా చేయడంకు కుదరలేదు. అప్పుడు ఇద్దరు కూడా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు. ఆ కారణం వలనో లేదంటే మరే కారణమో కాని 16 ఏళ్ల టైం పట్టింది.

2002వ సంవత్సరంలో తనతో సినిమా చేయమని సెల్వను అడిగితే 2018లో మొదలు పెట్టాడంటూ సూర్య సరదాగా వ్యాఖ్యానించాడు. ఎన్జీకే చిత్రంపై తమిళ సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 31న తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా సాయి పల్లవి మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు నటించారు. ఈ చిత్రంతో సూర్య వంద కోట్ల క్లబ్ పై దృష్టి పెట్టాడు. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.
Please Read Disclaimer