డిజైనర్ లోదుస్తులకు సుర్వీన్ చావ్లా బ్రాండింగా?

0ఎక్కడో మహాసముద్రంలో వచ్చిన సునామీ అండమాన్ ని అతలాకుతలం చేయడం చూశాం. సునామీ దెబ్బకు అండమాన్ దీవులు గజగజ ఒణికాయి. అక్కడ ఇండ్లు – చెట్టు చేమల్ని పెనువిళయం తుడిచిపెట్టేసింది. భారీగా ఆస్తి – ప్రాణ నష్టం కలిగింది. నాటి ఆ సునామీ మాటేమో కానీ – ఇదిగో ఇప్పుడు అంతకుమించిన ఓ విపత్తు. అది కూడా `హేట్ స్టోరి 2` బ్యూటీ వల్ల!

బాలీవుడ్ లో హేట్ స్టోరి సిరీస్ లో వచ్చిన `హేట్ స్టోరి 2` బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్. కాసుల కుంభవృష్టి కురిసింది. ఆ సినిమా విజయంలో సుర్వీన్ చావ్లా కీలక పాత్రధారి. తనవైన మత్తు కళ్లతో – వేడెక్కించే హావభావాలతో కుర్రకారును పదే పదే థియేటర్లకు రప్పించడంలో సుర్వీన్ పెర్ఫామెన్స్ కి ఓ రేంజులో మెప్పు దక్కింది. టైటిల్ కి తగ్గట్టే తనని అత్యంత దారుణంగా మోసం చేసిన కొందరు కార్పొరెట్ బాబులతో ఓ అబల ఎలా ఆడుకుంది? ఎలా హత్యలకు పథకం పన్నింది? అన్న కథతో పిచ్చి రేపింది ఆ సినిమా. సుర్వీన్ దెబ్బకు థియేటర్లు సెగలు కక్కాయ్. అయితే అంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా ఎందుకనో ఈ అమ్మడు ఆ తర్వాత దానిని క్యాష్ చేసుకోలేకపోయింది. ఆరేడేళ్ల క్రితం మోహన్ బాబు- శర్వానంద్ ల సినిమా `రాజు మహారాజు`లోనూ నటించినా తెలుగు పరిశ్రమా ఛాన్సులివ్వక నిరాదరణకు గురైంది. అలా సుర్వీన్ అతిధిలా వచ్చి వెళ్లిపోయింది.

కట్ చేస్తే.. ఇదిగో ఇలా అండమాన్ లో తేలింది. అక్కడ బికినీ బీచ్ లో తనదైన శైలిలో డిజైనర్ బికినీలో దర్శనమిచ్చి పెద్ద షాకిచ్చింది. పిచ్చెక్కించే పసుపు పచ్చ డిజైనర్ బికినీలో తళాంగుతళుకులు ప్రదర్శించింది. అది కూడా ఇలా వెనకభాగంను చూపిస్తూ సెగలు రేపింది. ప్రస్తుతం ఈ ఫోజు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో మరోసారి వేడి పెంచింది కాబట్టి మరి ఇప్పటికైనా ఫిలింమేకర్స్ పిలిచి ఛాన్సులిస్తారేమో చూడాలి.