చిరు కూతురికి సైరా సవాల్

0మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నరసింహరెడ్డి షూటింగ్ కు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకులు పడుతున్నా రెగ్యులర్ గా అయితే కొనసాగుతూనే ఉంది. పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే విడుదల చేసిన టీజర్ అభిమానుల అంచనాలు పెంచేసింది. వచ్చే వేసవిలో విడుదల కానున్న ఈ మెగా మూవీ అన్ని భారతీయ భాషల్లోనూ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్ షెడ్యూల్స్ మొదలుకుని సంగీత దర్శకుడి దాకా ఇప్పటిదాకా పలు సవాళ్లు ఎదురుకున్న సైరా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ విషయంలో కూడా అలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తే చెన్నై నుంచి చిరు పెద్ద కూతురు సుస్మిత రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఎందుకంటారా. నిజానికి సైరాకు ముందు అనుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ అంజు మోడీ. బాజీరావు మస్తానీ లాంటి సినిమాలకు పని చేసిన అనుభవంఉండటం తో తనను తీసుకున్నారు. కానీ సీమ స్థితిగతులు చరిత్ర గురించి సరైన అవగాహన లేని కారణంగా అంజు డిజైన్ చేసిన వాటిలో సహజత్వం మిస్ అవుతోందని భావించిన సూరి టీమ్ సుస్మితకే కబురు పెట్టారట

సో ఖైదీ నెంబర్ 150 కోసం ఏదైతే బాధ్యతను సుస్మిత నిర్వర్తించిందో ఇప్పుడు మరోసారి సైరా కోసం కొనసాగించాల్సి వస్తోంది. కానీ అదంతా ఈజీ కాదు. ముందు చేసింది కమర్షియల్ సినిమా కాబట్టి ట్రెండ్ కు తగ్గట్టు ఆలోచించడం వల్ల చిరు డ్రెస్సులకు మంచి పేరు వచ్చింది. కానీ సైరా చరిత్ర దశాబ్దాల వెనకటిది. దాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్పటి యోధులను ప్రతిబింబించేలా దుస్తులు సమకూర్చాలి. అతి త్వరలో 500 పైగా ఆర్టిస్టులు పాల్గొనే ఓ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉందట. దానికోసమే సుస్మిత భారీగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అంజు మోడీని తప్పించిన సరైనదే అని ఋజువు చేయాల్సిన బాధ్యత కూడా సుస్మిత మీద ఉంది. అందుకే ప్రతి చిన్న విషయం మీద అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్టు సమాచారం. సైరా విడుదల తేదీ గురించిన క్లారిటీ వచ్చే ఏడాది ప్రారంభానికి కానీ తెలిసే ఛాన్స్ లేదు. బడ్జెట్ కు తగ్గట్టే మెగా ఫాన్స్ నిరీక్షణ కూడా భారీగా ఉండక తప్పదు మరి.