నిశ్చితార్థం అంగుళీక ప్రదర్శనా ఇది?

0

కథానాయికల ప్రేమ వ్యవహారాలు నిరంతరం ఓ సర్ ప్రైజ్ ట్రీట్ లానే అభిమానులు భావిస్తుంటారు. ఏదీ ముందే చెప్పరు.. ఏళ్లకు ఏళ్లు దాగుడు మూతల దాంపత్యం అనంతరం జంటగా ఓ ఘాటైన సందర్భంలో మీడియా కంటికి చిక్కాక తెలుస్తుంది. కలిసి షికార్లు చేయడం.. చనువుగా ఉండడం.. కౌగిలింతలు.. ఇవన్నీ సింప్టమ్స్ గా భావించి అభిమానులు ప్రేమ చిగురించిందని తెలుసుకుంటారు.

ఇదిగో అలాంటి ఎన్నో ఘటనల అనంతరం సీనియర్ కథానాయిక సుశ్మిత సేన్ ఇన్నాళ్టికి ఇక ప్రేమలో నిండా మునిగిందని డిక్లేర్ అయ్యారు ఫ్యాన్స్. పలు సందర్భాల్లో సుష్ తన ప్రియుడు రోహ్మన్ షాల్ తో కలిసి చనువుగా ఉన్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసింది. తమ మధ్య ప్రేమను అధికారికంగానే ధృవీకరించింది. వయసులో తనకంటే చాలా చిన్నవాడు అయినా .. మనసులు కలిసాయని అంతా భావించారు. ఇక రోహ్మన్ షాల్ సుశ్మిత కుటుంబంలో కలిసిపోవడమే గాకుండా … తన దత్త పుత్రుల్ని పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడట.

తాజాగా రోహ్మన్ తో కలిసి సుశ్మిత లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ ఫోటోల్లో ప్రియుడిని అల్లుకుపోయిన సుశ్మిత .. ఓ రహస్యాన్ని బట్ట బయలు చేసింది. తన చేతి వేలికి నిశ్చితార్థ ఉంగరం దర్శనమిచ్చింది. అయితే తమకు నిశ్చితార్థం అయ్యింది! అన్న విషయాన్ని ఈ జంట అస్సలు చెప్పనే లేదు ఇంతవరకూ. ఇలా ఫోటోలు చూసి అభిమానులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాదే వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రియుడితో న్యూయార్క్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది. సుశ్మిత.. రొహ్మన్ చేయి పట్టుకుని పరిగెడుతున్న ఫోటో ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. టాప్ మోడల్ గా రాణిస్తున్న రోహ్మన్ ఇంత సీనియర్ బ్యూటీతో ఎలా ప్రేమలో పడ్డాడో కానీ నిండా మునిగాడనే మాట్లాడుకుంటున్నారంతా. సుశ్మిత సేన్ వయసు 43.. పాతికకు అటూ ఇటూగా ఉన్న రోహ్మన్ ప్రేమలో పడ్డాడంతే. అయినా ప్రేమ గుడ్డిది అని అనేది ఇందుకేనేమో!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home