ఫిట్ గా ఉన్న డింపుల్ బ్యాక్

0

మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ సరిగ్గా ఏడాది క్రితం వెయిట్ పెరిగి బొద్దుగా కనిపించడంతో అదొక ‘బ్రేకింగ్ న్యూస్’ అయింది. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుష్మిత తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి స్లిమ్ముగా మారింది. తన వయసిప్పుడు 42. కానీ ఆమె ఫిట్ నెస్ చూస్తే మాత్రం 20 ఏళ్ళ భామలకు కూడా అసూయ పుడుతుంది.

ఇక అందరూ బాలీవుడ్ బ్యూటీలలాగానే సుష్మిత కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్. రీసెంట్ సుష్మిత ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో వెనకకు తిరిగి ఉంది. ఆమె భుజాలు.. చేతులు వీపు భాగంలో ఒక మిల్లి గ్రామ్ కూడా ఫ్యాట్ లేదు.. అంత ఫిట్ గా మారింది. ఈ ఫోటోకు సుష్మిత పెట్టిన క్యాప్షన్ “భారీ ఫలితాలు చూడాలంటే మనం చిన్న వాటిపై ఫోకస్ చేయాలి. #డింపుల్ బ్యాక్ #ట్రాన్స్ ఫర్మేషన్ # హార్డ్ వర్క్ #స్త్రెంగ్థ్. లవ్ యూ గైస్”.

ఈ ఫోటోకు దాదాపుగా రెండు లక్షల లైకులు వచ్చాయి. చాలామంది నెటిజనులు సుష్మిత పట్టుదలపై..ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతైనా గతంలో సూపర్ మోడల్ కదా.. అందరూ వెయిట్ పెరిగిందని కామెంట్లు చేసేసరికి ఇలా గట్టిగా సమాధానం ఇచ్చింది.
Please Read Disclaimer