మలైకా తర్వాత సుష్మితా షాకిచ్చిందోచ్!

0

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు బాగా కుర్రగా ఎర్రగా బుర్రగా ఉండే అబ్బాయిలను చూసుకుని పెళ్ళికి సై అంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్ళు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో పెళ్ళికి రెడీ అవుతోంది. డిసెంబర్ లో లగ్గాలు పెట్టుకున్నారు. నిక్కు ప్రేమలో ఆమె ఓలలాడుతూ ఉంది. జస్ట్ పీసీతో స్టొరీ ఆగలేదు.

మలైకా అరోరా ఖాన్ తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. యువ బాలీవుడ్ హీరో.. బోనీ కపూర్ కుమారుడు అయిన అర్జున్ కపూర్ తో ఆమె లవ్వే విడాకులకు కారణమని బాలీవుడ్ లో చెవులు గట్టిగా కొరుక్కున్నారు ఇప్పుడు అదీ పబ్లిక్ అయింది. ఈ లవ్ జంటకు దాదాపు 12 ఏళ్ళు తేడా. రీసెంట్ గా ఫారెన్ టూరుకు వెళ్ళిన వారు.. ముంబై లో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు.

ఇక ఈ ట్రెండ్ ను ఫుల్ పీక్స్ లో కి మాజీ విశ్వసుందరి తీసుకెళ్ళనుంది. ఈ నలభై రెండేళ్ళ పెళ్ళికాని సుందరి ఇద్దరు పిల్లలను ఎప్పుడో దత్తత తీసుకుని సింగిల్ మదర్ గా పెంచుకుంటోంది. పెళ్ళి ఊసు ఎప్పుడూ ఎత్తలేదు. కానీ తాజాగా తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన మోడల్ రోమన్ షాల్ ప్రేమలో పడిపోయిందట. ఇద్దరూ ప్రేమలోకంలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా పండగ చేసుకుంటోంది.

ఇక సుష్మిత కూడా కుర్ర బాయ్ ఫ్రెండ్ తో అచ్చిక బుచ్చికలాడుతూ ఉన్న ఫోటోలను ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి ‘దుగ్గాదుగ్గా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దానికి తోడు ఒక లవ్ ఎమోజిని జోడించింది. మరి ఆ దుగ్గాదుగ్గా మీనింగ్ ఏంటో మీరే చెప్పాలి. చూస్తుంటే ఇకపై సీనియర్ హీరోలు.. నిర్మాతలు తమ పాతికేళ్ళ కొడుకులకు కంచెలు కట్టి కాపాడుకోవాల్సి వచ్చేటట్టు ఉంది. లేకపోతే ఏ మెనోపాజ్ వయసొచ్చిన లేటు వయసు ఘాటందం ఎగరేసుకొని పోతుంది!
Please Read Disclaimer