రొమాన్స్ పై మనసు పడిన భామ

0Susmitha-Senతన అందంతో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. కోట్లాది మందిని తన అందంతో మెస్మైరైజ్ చేసింది సుస్మితాసేన్. సన్నజాజి మొగ్గ అసూయపడేలా ఉండే ఈ సహజ సోయగం.. తన అందాలతో పిచ్చెక్కించింది. అందానికి మించిన అందమైన మనసు సుస్మితా సొంతమన్న విషయం ఆమె పర్సనల్ విషయాలు తెలిసినోళ్లంతా చెబుతుంటారు.

విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. బాలీవుడ్.. టాలీవుడ్ ఛాన్స్లను చేజిక్కించుకొని వెండి తెర మీద మెరిసిన సుస్మితా అనుకున్నంత ఫేం అయితే సాధించలేదని చెప్పాలి. ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఐశ్వర్యతో పోలిస్తే.. ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు.. ఇమేజ్… అవకాశాలు తక్కువనే చెప్పాలి.

సినిమా ఛాన్స్ లు తగ్గిన వెంటనే పెళ్లి చేసేసుకొని సెటిల్ అయ్యే తీరుకు భిన్నంగా ఉంటూ.. ఇప్పటికి సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది సుస్మిత. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొన్న ఆమె.. తన బాధ్యతను యమా సీరియస్ గా నిర్వర్తిస్తోందని చెప్పాలి. 2010 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సుస్మిత గత ఏడాది ఒకట్రెండు సినిమాకు ఓకే చెప్పింది.

యంగ్ ఏజ్ లో ఓ మెరుపు మెరిసి.. మధ్యలో గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇస్తున్న నటీమణులంతా తమ ఏజ్ కు తగ్గ పాత్రలు వస్తే చాలని అనుకుంటే.. సుస్మిత మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతోంది.తాను గతంలో కామెడీ.. హారర్.. డ్రామా..ఎమోషన్స్ చిత్రాల్లో నటించానని.. నటిగా తానేంటో నిరూపించానని.. ఇప్పుడైతే మాత్రం రొమాంటిక్ మూవీలో నటించాలన్న కోరికను బయటపెట్టింది.

ఫార్టీ ప్లస్ వచ్చేసిన వేళ.. రొమాంటిక్ కు సిద్ధమని చెబుతున్న సుస్మిత మాటలకు దర్శక.. నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయినా.. ఉన్నట్లుండి సుస్మితకు రొమాన్స్ మీద మనసు పోవటం ఏమిటి చెప్మా?