టాక్సీ ఎక్కడ విజయ్

0అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఫేవరెట్ గా మారిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా టాక్సీ వాలా గురించి అప్ డేట్స్ సడన్ గా ఆగిపోయాయి. ఆ మధ్య టీజర్ ఒకటి విడుదల చేసారు కానీ దాని తర్వాత ఉలుకుపలుకు లేకుండా యూనిట్ సైలెంట్ అయిపోయింది. యువి గీతా లాంటి పెద్ద సంస్థలు టై అప్ అయ్యి తీసిన మూవీకి క్లారిటీ మిస్ అవ్వడం సినిమా వర్గాలకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముందు చెప్పిన ప్రకారం అయితే టాక్సీ వాలా ఖచ్చితంగా మే లేదా జూన్ లో విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. పోనీ జులై అని నిక్కచ్చిగా చెబుతున్నారా అంటే అదీ లేదు. ఓ రెండు వారాల క్రితం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో త్వరలో వచ్చి అలరిస్తుంది అన్నాడు కానీ ఆ తర్వాత తానూ సైలెంట్ అయ్యాడు. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది అన్నది అర్థం కావడం లేదు. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రీత్యాన్ దీన్ని సమర్ధవంతగా డీల్ చేయటంలో అంచనాలు అందుకోలేదని అందుకే కొంత భాగం రీ షూట్ కు వెళదామని అల్లు అరవింద్ తో సహా సహ నిర్మాత అభిప్రాయం వ్యక్తం చేయటంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే ప్రచారం జరిగింది.

కానీ ఏది నిజం అనేది మాత్రం బయటికి రావడం లేదు. అర్జున్ రెడ్డి ఏడాది పూర్తి చేసుకుంది. దాని తర్వాత ఐదు సినిమాలు ఒప్పుకున్న విజయ్ దేవరకొండకు ఒక్కటి కూడా విడుదల కాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ లో ప్రేక్షకులు ఇప్పుడు లేదు. టాక్సీ వాలా కంటెంట్ తో మెప్పిస్తేనే జనం ఆదరిస్తారు. అంతేకాని విజయ్ దేవరకొండ సినిమా అని చెప్పి గుడ్డిగా పట్టం కట్టరు. పైగా ట్రావెల్ థ్రిల్లర్ తరహాలో గతంలో వచ్చిన కార్తీ ఆవారా ఛాయలు ఇందులో ఉన్నాయనే కామెంట్స్ టీజర్ పోస్టర్ చూసాక విన్పించాయి. వీటికి చెక్ పెట్టాలి అంటే రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వాలి. మరి టాక్సీ గురించి ఎవరు మాట్లాడకపోతే అసలు మీటర్ లో ఎక్కడ తేడా వచ్చింది ఎక్కడ పంచర్ అయ్యింది అనే కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి.చిన్నపెద్ద తేడా లేకుండా ఏ హీరో సినిమా అయినా జనంలోకి వెళ్లాలంటే ప్రమోషన్ చాలా కీలకంగా మారిన తరుణంలో అసలు ఎప్పుడు వస్తుందో తెలియకుండా క్లారిటీ మిస్ అవుతున్న టాక్సీ వాలా ఇప్పటికైనా మోక్షం కలిగించుకోవాలని విజయ్ దేవరకొండ ఫాన్స్ కోరుతున్నారు.