‘స్వాగ్‌ సే స్వాగత్‌’ కోటి మందికి పైగా వీక్షించారు

0బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ అనే తొలిపాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది.

అయితే ఈ పాటను కేవలం విడుదల చేసిన 24 గంటల్లోనే కోటి మందికి పైగా వీక్షించారు. మూడు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు ఈ పాట అంతర్జాతీయ ఆల్బమ్స్‌ను కూడా బీట్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన పాట కూడా ఇదే కావడం విశేషం.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సల్మాన్‌కి జోడీగా కత్రినా కైఫ్‌ నటించింది.2012లో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’కు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కానుంది.