స్వర భాస్కర్.. ఇదేమి పైత్యం?

0సినిమాపై ఏదయినా వివాదం తలెత్తాలంటే ఒకోసారి ఒక్క సీన్ చాలు. దానిపై చర్చోపచర్చలు జరిగి చివరకు పెద్ద డిబేట్లే సాగుతాయి. వివాదానికి కారణమయ్యే సీన్ సెక్స్ కు సంబంధించిన అంశమైతే ఆ రచ్చ ఓ రేంజిలో ఉంటుంది. ప్రస్తుతం వీరే ది వెడ్డింగ్ లో ఓ సీన్ ఇలాగే కాంట్రవర్షియల్ గా మారుతోంది.

వీరే ది వెడ్డింగ్ నలుగురి అమ్మాయిల కథ. కరీనా కపూర్ – సోనమ్ కపూర్ – స్వర భాస్కర్ – శిక్ష తల్సానియా నలుగురి అమ్మాయిలుగా నటించారు. ఈ సినిమా చాలా బోల్డ్ గా తీశారు. ఎంత బోల్డ్ గా అంటే ఈ సినిమాలో ఓ సీన్ లో స్వర భాస్కర్ వైబ్రేటర్ తో స్వయం తృప్తి (మాన్ స్ట్రుబేషన్) పొందుతూ కనిపిస్తుంది. ఈ సీనే ఇప్పుడు కాంట్రవర్సీకి సెంటర్ గా మారింది. ఇదో ఛీప్ ట్రిక్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా… ఇంకొందరు ఈ సీన్ చేసిన స్వర భాస్కర్ ను తిట్టిపోస్తున్నారు. ఈ సీన్ ను సమర్ధిస్తూ స్వర భాస్కర్ ఇస్తున్న సమాధానం మాత్రం మరింత డిఫరెంట్ గా ఉండటం విశేషం.

‘‘ఈ సీన్ లో మాన్ స్ట్రుబేషన్ అనేదానిని నాలుగు గోడల మధ్య జరిగినట్టుగా చూపించారు. పబ్లిక్ లో చేసుకున్నట్టుగా చూపించలేదుగా.. ఎవరి శరీరం వాళ్లిష్టం. ఒక అమ్మాయి మనసులోని సెక్సువల్ ఫీలింగ్ చూపించడం కూడా తప్పంటే ఎలా… దానిని ఒప్పుకునే తీరాలి. అదే మహిళా సాధికారికత (ఎంపవర్ మెంట్) అంటే’’ అంటూ ఈ వివాదంపై స్వరభాస్కర్ తన వెర్షన్ వినిపించింది. మాన్ స్ట్రుబేషన్ కు మహిళా సాధికారిత అనడం పైత్యం తప్ప ఇంకేం కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.