ప్రభాస్ పై కన్నేసిన బాలీవుడ్ బాంబ్

0బాలీవుడ్ కి ఏమయ్యిందో ఏమో కాని గత కొంత కాలంగా టాలీవుడ్ ని తెగ కలవారిస్తోంది. ఏ ప్రెస్ మీట్ లు జరిగినా.. ఎలాంటి ఇంటర్వ్యూలలో అయినా కూడా టాలీవుడ్ ప్రస్తావన రాకుండా ఉండడం లేదు. స్టార్ హీరోల నుంచి హీరోయిన్స్ వరకు మన టాలెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ మిడియల్లో ఎక్కువగా వినిపోస్తోంది. బాహుబలి ఇచ్చిన డోస్ అని ఈజీగా చెప్పవచ్చు.

అందుకే మొదట ప్రభాస్ పేరుతో మొదలెట్టేస్తున్నారు. అతనితో సినిమా చేయాలని ఉందని నార్త్ ముద్దు గుమ్మలు బల్ల గుద్ది చెప్పేస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ బాంబ్ స్వర భాస్కర్ కూడా బాహుబలి హీరో గురించి గట్టిగానే చెప్పేసింది. అసలే అమ్మడు చేసే వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏదైనా మొహం మీదే చెప్పేస్తుంది. గతంలో పద్మావత్ సినిమా చూసి ఆడవాళ్లకు సంబంధించిన సీన్స్ ను తగ్గించేస్తున్నారని తెగేసి చెప్పింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే స్క్రిప్ట్ ఏంటని చూడకుండా ఒకే చేస్తాను అని క్లారిటీ ఇచ్చేసింది.

తన తండ్రి తెలుగు వ్యక్తి అని తనకు తెలుగు సినిమాల గురించి బాగా తెలుసని కూడా అమ్మడు వివరించింది. ప్రభాస్ తో నటించాలని చాలా కొరికగా ఉందని టాలీవుడ్ లో మొదటి సినిమా ఆయనతో అవకాశం వస్తే రెడీ అని మరోసారి క్లాటిటి ఇచ్చింది. స్వర భాస్కర్ ఇటీవల వచ్చిన వీరే ది వెడ్డింగ్ సినిమాలో ఒక హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.