స్వాతి ఇమేజ్ ఈ కుర్రహీరోకి కలిస్తోంది!

0

Swathi-hotహ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో నిఖిల్ కు ‘స్వామి రారా’ రూపంలో దక్కిన హిట్ మంచి ఊరటను అందించింది. కెరీర్ మొదట్లో హ్యాపీడేస్, యువత సినిమాలు హిట్ అవ్వడంతో నిఖిల్ ను వరస అవకాశాలు పలకరించాయి. అదే ఊపులో ఇతడు ఎన్నో చెత్త సినిమాలు చేసి అపజయాలను మూటగట్టుకున్నాడు.

ఇక ఈ హీరో పని అయిపోయిందనుకున్న తరుణంలో.. స్వామిరారా వచ్చింది. హిట్ ను తెచ్చిపెట్టింది. మరి ఒక హిట్ కొడితే ఆ మూసలో వచ్చే సినిమాలు చాలానే ఉంటాయి. ఈ ఫార్మాలనే ఫాలో అవుతూ.. స్వామిరారాలో పెయిర్ గా చేసిన నిఖిల్, స్వాతిలు ముఖ్యపాత్రల్లో ‘కార్తికేయ’ అనే సినిమా వస్తోంది. ఇది కూడా స్వామిరారా లాంటి థ్రిల్లర్ సినిమానే అని తెలుస్తోంది.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. అక్కడ కలర్ స్వాతికి మంచి గుర్తింపే ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సినిమాను కోలీవుడ్ కు తీసుకెళ్తున్నారు. మరి ఈ థ్రిల్లర్ సినిమా స్వాతి ఇమేజ్ తో అక్కడ హిట్ అయితే..ఈ కుర్ర హీరోకు ఫుల్ హ్యాపీనేమో!

Tags : Swathi Fame become advantage to Hero Nikhil, Hero Nikhil and Swathi in Karthikeya, Swamy Ra Ra Pair in Karthikeya, Hero Nikhil Kollywood Entry, Swathi and Nikhil rommance on screen, స్వాతి ఇమేజ్ ఈ కుర్రహీరోకి కలిస్తోంది!
Please Read Disclaimer