స్వాతి ఎక్సపోసింగ్ కి రెడీనా?

0swathi-reddy-hotకలర్స్ స్వాతి హీరోయిన్ గా కూడా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వరుసగా ఫ్లాప్స్ రావడంతో.. గతేడాది ఈమె ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలు చేసేస్తోంది స్వాతి.

తమిళ్ లో యాక్కాయ్.. తిరి సినిమాలు చేస్తున్న స్వాతి.. తెలుగులో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. సాధారణంగా మారుతి సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్లను ఓ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ మిక్స్ చేసి చూపిస్తుంటాడు మారుతి. అలాగని అన్నీ సేమ్ డిట్టో ఉండాల్సిన పనేమీ లేదు. నయనతారను బాబు బంగారం మూవీలో బంగారంలానే చూపించాడు. మరి ఇప్పుడు స్వాతి ఎలాంటి పాత్ర పోషిస్తోందనే విషయమే ఆసక్తి కలిగించే విషయం. స్వాతి లైట్ గా అడల్ట్ టచ్ ఇచ్చే రోల్ ని చేస్తోందనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.

అయితే తెలుగమ్మాయి స్వాతిని చూపించడంలో.. మారుతి కొత్త ఫార్ములా ఒకటి తెరపైకి తెస్తున్నాడని అంటున్నారు. అయితే.. అదేంటీ అనే విషయం మాత్రం ఇప్పటికి సస్పెన్సే అనేస్తున్నారు. ఈ విషయంలో స్వాతి కూడా కొత్తగా కనిపిస్తా అని చెబుతోంది కానీ.. ఆ విషయం మాత్రం విప్పడం లేదు. మరి ఈ స్వాతి గుట్టు ఎలా తెలిసేనబ్బా! రిలీజ్ వరకూ ఆగాల్సిందేనా! అయినా మారుతి సినిమాలు స్పీడ్ గానే తీసేస్తాడు కదా.. ఎక్కువ కాలం పట్టదు లెండి.