‘స్వాతినాయుడు’ కోరిక తీర్చుకుంది..

0యూట్యూబ్ సెక్సీ హాట్ వీడియోలు చూసే వారందరికీ స్వాతినాయుడు అంటే సుపరిచితమే.. ఆమె ఎన్నో అడల్ట్ – హాట్ – రోమాంటిక్ షార్ట్ ఫిలంలో నటించి యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నించినా ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు.. కొన్ని చిన్న చిత్రాల్లో పలు మసాలా పాత్రల్లో నటించినా ఆమె పేరు బయటకు రాలేదు. ఆ సినిమాలు వచ్చాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆశలు వదలుకోకుండా ఇలా బోల్డ్ గా నటిస్తూనే ప్రయత్నిస్తూనే ఉంది.

ఎట్టకేలకు స్వాతినాయుడు ఆశ నెరవేరింది. షకీలా ఇమేజ్ కోసం పాకులాడుతున్న ఈమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఓ టాలీవుడ్ కొత్త నిర్మాత ‘ఆమె కోరిక’ అనే టైటిల్ తో స్వాతినాయుడును లీడ్ రోల్ లో పెట్టి సినిమా తీశాడు.

సినిమా టైటిల్ ను బట్టే ఇదో హాట్ రోమాన్స్ మూవీ అని అర్థమవుతోంది. సినిమాలోని స్వాతినాయుడు సీన్లు – ఫొటోలు యూత్ ను కాకపుట్టిస్తున్నాయి. అంతేకాదు.. సదురు సినిమా యూనిట్ స్వాతినాయుడుకు ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ‘యూట్యూబ్ స్పైసీ స్టార్’ అంటూ స్వాతినాయుడును గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇలా సినిమాల్లోకి రావాలనుకున్న స్వాతినాయుడు కోరిక ‘ఆమె కోరిక’ సినిమాతో నెరవేరబోతోంది. ఈ హాట్ భామ మున్ముందు మరెన్ని అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి మరి.