సైరాకు ఆ డేట్ లాక్ చేసిన టీమ్?

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తారని ఈమధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఆగష్టు 15 న రిలీజ్ అన్నారు కానీ తర్వాత మాత్రం దసరాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రిలీజ్ డెడ్ లైన్ అందుకోలేమని భావించి ఆగష్టు 15 రిలీజ్ డేట్ డ్రాప్ చేసుకున్నారట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేసేందుకు ‘సైరా’ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ‘సైరా’ టీమ్ ఈ సినిమాకోసం సోలో రిలీజ్ డేట్ కోసం చూస్తోందట. అందుకే అక్టోబర్ 2 ను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఫ్రీడం ఫైట్.. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి గాంధీ జయంతి కంటే మరో బెటర్ డేట్ ఉండదని భావిస్తున్నారట.

ఈ ఏడాది అక్టోబర్ 8 న విజయదశమి కాబట్టి ఆ పండగకు ముందుగా కనీసం వారం రోజులు స్టూడెంట్స్ కు శెలవులు ఉంటాయి. ఈలెక్కన ‘సైరా’ టీమ్ దసరా శెలవుల అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నట్టే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగా భారీ వసూళ్ళు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.
Please Read Disclaimer