ఆగస్ట్ 18న తాప్సీ ఆనందం..

0Taapsee-Anado-Brahma-Movie-release-Dateవరుసగా తగిలిన రెండు ఎదురు దెబ్బల కారణంగా.. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను మళ్లీ నేల పైకి వచ్చేసింది. తన అందాన్ని తప్ప.. తన ప్రతిభను దక్షిణాది జనాలు ఉపయోగించుకోలేదంటూ తెగ కబుర్లు చెప్పేసిన ఈ భామకు.. రన్నింగ్ షాదీ.. నామ్ షబానాలు షాక్ ఇచ్చేశాయి. ఇప్పుడు ఆనందో బ్రహ్మ ఓ తెలుగు సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేస్తోంది.

ఇప్పటికైతే జుడ్వా2.. తడ్కా చిత్రాలు మినహా.. బాలీవుడ్ లో మరో అవకాశం అందేట్లుగా కనిపించడం లేదు. ఈ లోగా తనకు వచ్చిన గ్యాప్ లో.. గతంలో తనకు కథ చెప్పిన దర్శకుడిని పిలిచి మరీ చేసిన మూవీ ఆనందో బ్రహ్మ. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హారర్ కామెడీ జోనర్ లో ఈ మూవీ రూపొందింది. శ్రీనివాస్ రెడ్డి.. వెన్నెల కిషోర్.. తాగుబోతు రమేష్.. షకలక శంకర్ వంటి ఫామ్ లో ఉన్న కమెడియన్స్ అందరూ ఈ మూవీలో కనిపించనుండగా.. ఇప్పుడు వీరందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా కనిపిస్తున్న తాప్సీ ఫోటోను ఓ పోస్టర్ వేసి.. రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు.

ఆగస్ట్ 18న తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ రిలీజ్ ని షెడ్యూల్ చేశారు. ఈ విషయాన్ని తాప్సీ పన్ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆనందో బ్రహ్మ తెరకెక్కగా.. ఈ చిత్రాన్ని విజయ్ చిళ్లా.. శశి దేవిరెడ్డిలు నిర్మించారు.