కళ్లలో పవర్ కనిపిస్తోంది

0ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సి మొదటి చూపులోనే అందరిని ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సొట్ట బుగ్గల అందంతో బేబీ కుర్రకారు మనసుకు దోచేసుకింది. అప్పట్లో అమ్మడి ఎంట్రీ చూసి స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే ముద్దుగుమ్మ వచ్చేసింది అన్నట్లుగా టాక్ వచ్చింది. కానీ టాలీవుడ్ లో తాప్సి పెద్దగా సక్సెస్ కాలేదు.

కానీ బాలీవుడ్ లోకి వెళ్లి ఒక్క బికినీ లుక్ తో కనిపించే సరికి అమ్మడికి హిట్టు అదృష్టం మాములుగా పట్టలేదు. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ సినిమాల్లో కూడా ఎదో ఒక ప్రత్యేకత ఉండడం క్రేజ్ బాగా పెరిగిందని చెప్పాలి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అమ్మడు త్వరలో మరో ప్రయోగాత్మకమైన కథతో రాబోతోంది. డిఫెన్స్ లాయర్ గా ముల్క్ అనే సినిమాలో కనిపించనుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.

తాప్సి కళ్లలో నిజంగా ఓ న్యాయం కోసం పోరాడుతున్న లాయర్ కనిపిస్తున్నారని చెప్పవచ్చు. ఆమె కనిపించిన విధానం అలాగే కళ్ళల్లో తెలియని పవర్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని చెబుతున్నారు. న్యాయ వ్యవస్థ చుట్టు తిరిగే ఈ కథకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నాడు. రిషి కపూర్ – ప్రతీక్ – అశుతోష్ రానా – రజత్ కపూర్ వంటి స్టార్ నటీనటులు ముల్క్ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 3న సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.