తాప్సీ పనే బాగుందమ్మా!!

0హాట్ బ్యూటీ తాప్సి అదృష్టం ఏమిటో గాని గత ఏడాది నుంచి అమ్మడి లైఫ్ టోటల్ గా చేంజ్ అయ్యింది. బికినీ మత్రం బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె గ్లామర్ కి తగ్గట్టు నార్త్ లో మంచి విజయాలు అందుతున్నాయి. కొంచెం కొంచెంగా తన రేంజ్ ని పెంచుకుంటూ వెళుతోంది. ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగానే ఏ హీరోయిన్ ఇంత త్వరగా పికప్ అవ్వలేదు. అలాగే వరుసగా మంచి మంచి అవకాశాలు అందడం నిజంగా తాప్సి అదృష్టమని చెప్పాలి.

అయితే ఈ వరుస షూటింగ్స్ లలో అమ్మడు అలసిపోకుండా అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ కూడా తీసుకుంటోంది. ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడి వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా స్పెయిన్ కి వెళ్లిన ఈ సొట్ట బుగ్గల సుందరి మాడ్రిడ్ ప్రాంతాన్ని తెగ చుట్టేస్తోంది. షూటింగ్ కి కాస్త బ్రేక్ చెప్పేసి ప్రముఖ నగరాల అందాల నడుమ స్టిల్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

అక్కడ షాపింగ్స్ ..డిఫరెంట్ వెధర్ చాలా బాగా నచ్చయని తాప్సి తరచు సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటోంది. నాలుగు రోజుల హాలిడేస్ దొరగ్గానే తన వ్యక్తిగత సంతోషాన్ని అమ్మడు ఈ విదంగా విదేశాల్లో వెతుక్కుంటోంది. అంతే మరి.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి.. అనే మాటను తాప్సి బాగానే ఫాలో అవుతోంది. మొన్ననే కాశ్మీర్ లో మన్మర్జియా షూటింగ్ పూర్తి చేసి.. అమ్మడు ఇలా వెకేషన్లో సేద తీరుతోంది.