బయటకు చెప్పుకోలేనిది అందుకే

0హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని.. స్టార్ గా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు ఏదో ఒక స్టేజ్ లో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దీనిపై నోరు విప్పి మాట్లాడేది తక్కువ. అవకాశాల కోసం వచ్చిన మహిళలు తాము వేధింపులకు గురైన సందర్భాలు పంచుకుంటూ హాలీవుడ్ లో మీటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

ఈ #meToo క్యాంపెయిన్ బాలీవుడ్ దాకా వచ్చింది కానీ హాలీవుడ్ స్థాయిలో ఎవరూ ఇండస్ట్రీపై విమర్శలు చేయలేదు. వేధింపుల గురించి నోరు విప్పి చెప్పింది చాలా తక్కువమంది. అలాగని బాలీవుడ్ లో వేధింపులు లేవా అంటే లేవని కాదు. ఇక్కడ వీటి గురించి బయటపెట్టడానికి అమ్మాయిలకు తగినంత ధైర్యం లేదని అంటోంది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. ‘‘హీరోయిన్లుగా అడుగుపెట్టే వారిలో చాలామంది ఫిలిం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఉండదు. దాంతో ఇండస్ట్రీలో ఎలాంటి సెక్సువల్ వేధింపులు భరించాల్సి వస్తోందో కొందరు నాతో బాధ పంచుకున్నారు. కానీ ఇదే విషయం వాళ్లు ఓపెన్ గా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఇదో చీప్ పబ్లిసిటీ భావిస్తే అది వాళ్ల కెరీర్ కే నష్టమని భావించి మౌనంగా ఉండిపోతున్నారు’’ అంటూ ఇక్కడ మీటూ క్యాంపెయిన్ ఎందుకు పెద్దగా నడవడం లేదో విశ్లేషించి చెప్పుకొచ్చింది తాప్సీ.

అదృష్టమో.. దురదృష్టమో తన కెరీర్ లో ఎటువంటి వేధింపులు తాప్సీకి ఎదురవలేదట. ఎదురై ఉంటే గ్యారంటీగా ఓపెన్ గానే ఆవిషయం చెప్పేదాన్ని అంటోంది. ఈమధ్య బాలీవుడ్ లోనే బిజీగా ఉంటున్న తాప్సీ చాలారోజుల తరవాత తెలుగు తెరపై కనిపించనుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న నీవెవరో సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది.