పవర్ ఫుల్ రిటార్ట్ ఇచ్చిన పింక్ బ్యూటీ!

0ప్రపంచంలో ఉన్న అతి కష్టమైన క్లిష్టమైన విషయాల్లో ఒకటి విమర్శలను సరిగ్గా హ్యాండిల్ చేయడం. కొంతమంది.. ‘దాందేముంది.. వాడొకటంటే నేనొకటంటా – వీలయితే ఒకటి తగిలిస్తా’ అంటారు గానీ సెలబ్రిటీ లకు అలా కుదరదు. అలా విమర్శకులను సూపర్ గా హ్యాండిల్ చేసిన సెలబ్రిటీల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఒకరు. మీరు ఎన్నైనా విమర్శలు చెయ్యండి.. తన ఆటతో సమాధానం ఇస్తాడు.. నోటి తో కాదు. అఫ్ కోర్స్.. ఇప్పుడు ఆడటం లేదనుకోండి అది వేరే విషయం. మహేంద్ర సింగ్ ధోని కూడా దాదాపుగా అంతే.

మరి ఇలాంటి వారే కాకుండా ఇంకో క్యాటగిరి సెలబ్రిటీస్ కూడా ఉంటారు. వాళ్ళు మాత్రం లౌక్యంగా నోటితో సమాధానం ఇస్తారు. ఎంతలా అంటే అవతల విమర్శలు చేసేవాడి నోటమాట రాకుండా ఆగిపోయేలా! సొట్టబుగ్గల సుందరి తాప్సీ అలాంటిదే. తాప్సీ ఈమధ్య తన ట్విట్టర్ ఫాలోయర్లతో సరదాగా చిట్ చాట్ చేసింది. కొంతమంది ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.. కొందరు సరదాగా టీజ్ చేశారు.. మరో కొందరు హర్ట్ అయ్యేలా విమర్శలు చేశారు. కానీ తాప్సీ మాత్రం వాళ్ళకు సరదాగా.. షార్ప్ కౌంటర్లతో సరైన సమాధానాలు ఇచ్చింది.

చిట్ చాట్ లో భాగంగా ఒక నెటిజెన్ “బాలీవుడ్లో చెత్త లుక్స్ ఉన్న నటి తాప్సీ. నేను మళ్ళీ ఆమెను చూడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకెంత… 2- 3 సినిమాలే బాలీవుడ్ నుండి ఆమె అవుట్.” దీనికి తాప్సీ ఇచ్చిన సమాధానం “కానీ 3 ఆల్రెడీ అయిపోయాయి… ముల్క్ – మన్మర్జియాన్ – బద్లా ఉన్నాయి.. నిన్ను నిరాశపరుస్తున్నాను కానీ ఇవి కాకుండా మరో రెండు సైన్ చేశాను. మరి కొన్ని రోజులు నువ్వు భరించాల్సిందే.” మరి ఇలాంటి రిప్లై ఇస్తే.. ఇతర ట్విట్టర్ యూజర్స్ నుండి ప్రశంసలు రాకుండా ఉంటాయా?