అయ్యో పాపం సొట్టబుగ్గల చిన్నది మోసపోయింది

0

దక్షిణాది నుండి బాలీవుడ్ కు వెళ్లి చిన్నా చితకా సినిమాలతో మెల్ల మెల్లగా స్టార్ హీరోల సినిమాల్లో పెద్ద సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో గట్టి షాక్ తలిగింది. గత నవంబర్ లో ఈమె ఒక సినిమాకు కమిట్ అయ్యింది. ఆ సినిమా కు డేట్లు కేటాయించే ఉద్దేశ్యంతో మరే సినిమాను కూడా ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి తాప్సిని తొలగించడంతో గగ్గోలు పెడుతోంది. మీడియా ముందుకు వచ్చి మరీ తనకు అన్యాయం జరిగిందని తనను మోసగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తాప్సిని దర్శకుడు ముదాసర్ అలీ నవంబర్ లో ‘పతీ పత్ని ఔర్ ఓ’ అనే సినిమా రీమేక్ కోసం సంప్రదించాడట. 1978లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో రీమేక్ కు వెంటనే తాప్సి ఓకే చెప్పింది. షూటింగ్ ప్రారంభంకు కాస్త సమయం పడుతుందని దర్శకుడు ముదాసర్ చెప్పాడట. తాప్సి కూడా అప్పటి వరకు తన కమిట్ మెంట్స్ ను పూర్తి చేస్తానని దర్శకుడితో చెప్పిందట. తాప్సికి దర్శకుడు ముదాసర్ కథ చెప్పిన సమయంలో నిర్మాతలు కూడా అక్కడే ఉన్నారట.

అంతా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు తనను సినిమా నుండి తొలగించినట్లుగా వేరే వారి ద్వారా తెలిసింది. తనకు ఇప్పటికి కూడా దర్శకుడు కాని – నిర్మాతలు కాని చెప్పలేదని వారి వల్ల తాను చాలా లాస్ అయ్యానంటూ ఆగ్రహంతో మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను చెప్పుకొచ్చింది. ఎందుకు తప్పించారని ప్రశ్నించగా దర్శకుడు కాని నిర్మాతలు కాని నాకు ఇప్పటి వరకు సరైన సమాధానం కూడా ఇవ్వలేదని తాప్సి అంటోంది. ఎలాంటి కారణం లేకుండానే నన్ను ఎందుకు పక్కకు పెట్టారో వారే చెప్పాలంటూ తాప్సి వ్యాఖ్యలు చేసింది. అయితే బాలీవుడ్ వర్గాల్లో మాత్రం తాప్సి ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిన కారణంగా పక్కకు పెట్టి ఉంటారనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి తాప్సికి మాత్రం ఇదో పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు.
Please Read Disclaimer