అరెరే తాప్సీ గుర్తుపడితే ఒట్టు!!

0

హేయ్ తాప్సీ .. ఇంతలోనే ఏమైంది! మొన్నటి వరకూ కనిపించిన తాప్సీయేనా? ఇంతలోనే ఎంత మార్పు. ఈ ఛేంజ్ ఊహాతీతం. రోమ్ వెళితే రోమన్లా ఉండాలని పెద్దలు చెప్పిన మాట నిజమే కానీ – మరీ ఇంతగా గుర్తు పట్టలేనంతగా మారిపోతే ఎలా? అరెరే తాప్సీ అసలు గుర్తు పట్టలేం! అంటూ కుర్రాళ్లంతా తెగ ఇదైపోతున్నారు. అయ్యోపాపం తాప్సీకి ఏమైంది? అంటూ యూత్ లో అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయ్.

బాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలిగిపోతున్న ఈ అమ్మడి వాలకం గత కొంతకాలంగా పూర్తిగా మారిపోయింది. ముంబై వీధుల్లో .. ఫేజ్ 3 ప్రపంచం తనని అంతగా మార్చేసింది. ఎంతగా అంటే అసలు మేకప్ వేస్తే – ఆ కళ్లద్దం పెట్టుకుంటే తనని అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఒకరకంగా చూస్తే ఒకేరోజు 36 ఆపరేషన్లు చేయించుకున్న మైఖేల్ జాక్సన్ లా కనిపిస్తోంది. ముక్కు మొన తేలింది. చింపిరి జుత్తు ఏదోలా కనిపిస్తోంది. దోర దొండ పెదవులు అంత థిక్ గా వామ్మోవ్!! అన్నట్టే ఉంది ఆ మేకప్. ముఖంపై ఫౌడర్ కం ఫౌండేషన్ 5 సెంటీమీటర్లు ఎత్తుగా కనిపిస్తోంది. ఎంత సింపుల్గా కనిపించాలనుకుంటే అంత హాట్ గా కనిపిస్తోంది !! అరెరే తాప్సీ!!!

తనని టాలీవుడ్ కే పరిచయం చేసిన కె.రాఘవేంద్రరావు పైనే కామెంట్లు గుప్పించి ఇరకాటంలో పెట్టి ప్రమోషన్ కొట్టేసిన తాప్సీ మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. `ఆనందో బ్రహ్మ` తర్వాత మరో సినిమా చేస్తున్నా దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. ఈలోగానే బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారూక్ – బిగ్ బి అమితాబ్ వంటి దిగ్గజాలు నటిస్తున్న భారీ చిత్రంలో నటించనుంది. అదీ సంగతి.
Please Read Disclaimer