బస్టాండ్లలో 100 మినీ థియేటర్లు

0తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ లలో దాదాపు 100 మినీ థియేటర్ల నిర్మాణానికి వేగంగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఆ మేరకు అధికారికంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు – ఎఫ్ డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు – రాష్ట్ర రోడ్లు – రవాణా శాఖ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సీరియస్గా చర్చోపచర్చలు సాగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో మినీ థియేటర్ల ఏర్పాటునకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు సమకూర్చనుందని ప్రకటించారు. గత రెండు నెలలుగా ఆర్టీసీ అందుకు టెండర్లను పిలిచింది. ప్రస్తుతం బస్టాండ్లలో ఖాళీ స్థలాల్ని పరిశీలిస్తున్నారు. ఓవైపు చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దానికి విరుగుడుగా ఈ మందు వేస్తున్నారా? అన్న చర్చా నిర్మాతల్లో సాగుతోంది.