లైంగిక వేధింపులపై తమన్నా స్పందన

0Tamannaమళయాళి నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు విషయమై గత కొద్ది రోజులుగా మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సినీ సెలబ్రెటీలు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. , లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అరాచకాల సంస్కృతికి ఇకనైనా విడనాడండి అంటున్నారు.

మహిళా వేధింపుల గురించి స్టార్ హీరోయిన్స్ తాప్సీ, అమలాపాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి వారు ఇంతుకు ముందే స్పందించిన విషయం తెలిసిందే. వారు తమ మనోభావాలను చాలా స్పష్టంగా మీడియాతో పంచుకున్నారు. చిన్న చూపు చూడవద్దని చెప్తున్నారు. ఆడవాళ్లు సైతం చివరి వరకూ పోరాడాలని పిలుపు ఇస్తున్నారు. అదే మాదిరిగా ఇపుడు తమన్నా కూడా స్పందించారు.

గతంతో పోల్చుకుంటే మహిళల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందులా వారు అణగదొక్కబడడం లేదు. సినిమాల్లో కూడా స్వాతంత్య్రం లభిస్తోంది. ఇక్కడ హీరోయన్స్ ను ఉన్నతంగా చూపిస్తున్నారు. ఒకప్పుడులా ఫలాన దుస్తులే ధరించాలన్న ఒత్తిడి ఇప్పుడు లేదు. నాకు డ్రస్‌ సౌకర్యంగా లేకపోతే వాటిని ధరించను. మహిళలు ఆత్మాభిమానాన్ని కోల్పోరాదు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లను ఒకరు ఇస్తే పొందకూడదు. మనమే సాధించుకోవాలి అని నటి తమన్నా పేర్కొన్నారు.