మిల్కీ నయన్ ఇద్దరిదీ ఒకే కథ ?

0

ఈ మధ్య సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగానే వస్తున్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే దర్శకులు ఇలాంటి సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం గమనించవచ్చు. అందులోనూ స్టార్ హీరొయిన్లు వీటిని చేసేందుకు ముందు రావడంతో తాకిడి బాగానే ఉంటోంది. వచ్చే నెల 14న నయనతార మిల్కీ బ్యూటీ తమన్నాల సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కానున్నాయి. అందులో విశేషం లేదు కాని అంతకు మించిన ట్విస్ట్ వీటి కథల్లో ఉంది.

ఈనాడు-బిల్లా 2 ఫేం చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార నటించిన కోలైయుతీర్ కాలం హింది నుంచి తెలుగు తమిళ్ లోకి డబ్బింగ్ చేస్తున్న తమన్నా ఖామోష్ ఈ రెండింటిలోనూ హీరొయిన్ పాత్రలు మూగ చెవిటి కావడం విశేషం. అంతే కాదు హీరొయిన్ ను చంపడానికి ప్రయత్నించే కిల్లర్ సైకో చుట్టూ ఈ కథలు తిరుగుతాయట. ఈ కథల సారూప్యం గురించి నిజమెంతో చెప్పలేం కాని చెన్నై మీడియాలో టాక్ జోరుగా నడుస్తోంది. రాధారవి వివాదం వచ్చింది ఈ నయనతార సినిమా వల్లే. ముందు మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ అనుకున్నప్పటికీ పోటీ చాలా తీవ్రంగా ఉండటంతో డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.

వీటి తెలుగు డబ్బింగ్ వెర్షన్ల నిర్మాతలు టైటిల్స్ ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. ఈలోగా తమన్నా మరో సినిమా అభినేత్రి 2 వచ్చేస్తుంది. అదీ హారర్ సినిమా కావడం గమనార్హం. నయన్ ఇటీవలే చేసిన ఐరా డిజాస్టర్ కావడం ఇప్పుడు బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మొత్తానికి ఇద్దరు పేరున్న హీరొయిన్లు ఒకే తరహా పాత్రలు చేస్తూ ఆ రెండు ఒకే రోజు రిలీజ్ కు రెడీ కావడం అంటే విశేషమేగా
Please Read Disclaimer