పవన్ కళ్యాణ్ అలాంటి వారు కాదు – తమన్నా

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో..సెట్స్ లో ఎలాగుంటారో, బయట ఎలాగుంటారో , అసలు ఎవరి కోసం తన పద్ధతి మార్చుకోడు అందుకే ఆయనంటే నాకు ఇష్టం అంటూ తెలిపింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈమె నా నువ్వే అనే చిత్రం లో కళ్యాణ్ రామ్ సరసన నటించింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భాంగా మీడియా తో ముచ్చటించిన తమన్నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చింది. ” అభిమానులను ఆయనను ఎందుకంత అభిమానిస్తారో ఆయనతో కలిసి పనిచేసిన తరువాతే తెలిసింది. సెట్‌లోనైనా, బయట అయినా ఒకేలాగా ఉంటారు. ఎవరికోసమో తన పద్ధతి మార్చుకోరు. ఏ విషయమైనా సరే, నచ్చకపోతే నచ్చలేదంటూ ముఖం మీదే చెప్పేస్తారు. కెమెరా ముందుకు రాగానే పూర్తిగా మారిపోయి పాత్రలో లీనమైపోతారు ” అంటూ తెలిపింది. వీరిద్దరూ కలిసి కెమెరామెన్ గంగ తో రాంబాబు చిత్రం లో నటించారు.