మిల్కీ.. ఈ ప్రయోగాలు అవసరమా?

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ల సరసన ఇప్పటికే నటించేసింది. ఎన్టీఆర్ – బన్ని- రామ్ చరణ్- ప్రభుదేవా లాంటి స్టార్ల సరసన నటించి వారికి ధీటైన డ్యాన్సులతో మెప్పించిన ట్యాలెంటుగా అభిమానుల గుండెల్లో నిలిచింది. టాలీవుడ్ టు బాలీవుడ్ తమన్నా డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి ఎంతో ఇదిగా ముచ్చటించుకుంటారు ఫ్యాన్స్. బాహుబలి అవంతికగా తనదైన ముద్ర వేయడంలోనూ మిల్కీ బ్యూటీ సఫలమైంది.

అదంతా సరే కానీ.. ఇటీవల ఎందుకనో ఈ పాలనురుగు సుందరి ట్రిక్స్ అస్సలు ఫలించడం లేదు. ముఖ్యంగా ప్రభుదేవాకు జోడీగా నటించిన అభినేత్రి 1- 2 రెండు చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ అందచందాల ఎలివేషన్.. డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగింది. కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్స్. అయినా తమన్నా మాత్రం ప్రయోగాల బాట విడిచిపెట్టడం లేదని తాజా స్టెప్ చెబుతోంది.

తమన్నా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించబోతోంది. ఇది పూర్తిగా డ్యాన్స్ బేస్డ్ ఫిలిం. పైగా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమా అని తెలుస్తోంది. సీనియర్ భామలు నయనతార.. త్రిష.. కాజల్ ఈ తరహాలోనే కొత్త బాటలో వెళుతున్నందున తమన్నా కూడా ప్రయోగాల బాటనే ఎంచుకుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. గతంలో తను నటించినవి డ్యాన్స్ బేస్డ్ సినిమాలే. కానీ కథ- కంటెంట్ లేక ఫ్లాపులు అవ్వడంతో ఈసారి ప్రయోగం ఏమవుతుందోనన్న సందేహాలు నెలకొన్నాయి. సూపర్ థ్రిల్లింగ్ డ్యాన్స్ బేస్డ్ మూవీతో వస్తానని అంటోంది. మరి ఏమవుతుందో?
Please Read Disclaimer