‘జై లవకుశ’లో తమన్నా లుక్‌ అదుర్స్‌

0ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుశ’లోని ప్రత్యేక గీతంలో కథానాయిక తమన్నా ఆడిపాడింది. ‘స్వింగ్‌ జరా..’ అంటూ సాగే ఈ పాటను శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు విడుదల చేస్తున్నారు. కాగా ఇందులో తమన్నా లుక్‌ను తెలుపుతూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మిల్కీబ్యూటీ చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. తమన్నా బంగారు వర్ణంలో చాలా స్టైలిష్‌, సూపర్‌గా ఉన్నారని ట్వీట్లు చేస్తున్నారు. ఈ పాట కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

‘స్వింగ్‌ జరా..’ లాంటి అద్భుతమైన పాటను ఇచ్చిన దర్శకుడు బాబీ, హీరో ఎన్టీఆర్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లకు ఈ సందర్భంగా తమన్నా ధన్యవాదాలు చెప్పారు. ‘జై లవకుశ’ను చూడడానికి ఆతృతగా ఉందని ట్వీట్‌ చేశారు.

నివేదా థామస్‌, రాశీఖన్నా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

First-Look--Ravishing-Tamanna-in-JLK