ప్రభాస్ సాహోలో మిల్కీ బ్యూటీ?

0Prabhas-and-Tamannaబాహుబలి మత్తు పూర్తిగా పోకముందే ప్రభాస్ ఇప్పుడు తన తరవాత మూవీ కి షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు హాలిడేస్ లో ఉన్న ప్రభాస్ ఈ నెల నుండే సాహో షూటింగ్ మళ్ళీ మొదలుపెడతాడట. బాహుబలి ఇచ్చిన సూపర్ బూస్ట్ అప్ తో ప్రభాస్ కి ఇప్పుడు దేశ నాలుగుదిక్కులు నుండి ఆఫర్లు వస్తున్నాయి. కాబట్టి తన రోబోతున్న సాహో కూడా తమిళ్ హింది మలయాళం లో విడుదల చేయడానికి రంగం సిద్దమవుతుంది.

సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ మొన్న విడుదలయైంది. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ ఎవరు ఇంతకీ? కొత్తమ్మాయి రష్మిక అన్నారుగా. తరువాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ పరిణీతి చోప్రాను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు షాకింగ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. ప్రభాస్ తో ఈ సినిమాలో జంటగా అమ్మడు నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ తమన్నా ఇప్పటికే ప్రపంచానికి తెలిసిన జంటగా బాహుబలిలో నటించారు. అంతకుముంది ఫ్లాప్ సినిమా రెబెల్ లో తమన్నా భారీగానే ఆరబోసింది. కాని ఒక సినిమా అట్టర్ ఫ్లాప్.. అలాగే బాహుబలి సినిమాకు తెలుగులో తొలుత యావరేజ్ టాక్ రావడం.. ఇప్పుడు ప్రభాస్ అభిమానులను కలత చెందిస్తున్న అంశం. చూద్దాం ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేస్తారో చివరకు!!