మిల్కీ బ్యూటీ అందుకే నో చెప్పిందా?

0మాస్ మహారాజా సినిమాలో హీరొయిన్ గా చేసే అవకాశాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా చేతులారా వదిలేసుకుంది అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రూపొందించే కొత్త సినిమాలో ఒక హీరొయిన్ గా కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఓకే కాగా రెండో హీరొయిన్ కోసం తమన్నాను అడిగారట. కాని రెమ్యునరేషన్ ఏకంగా కోటి 20 లక్షల దాకా డిమాండ్ చేయటంతో సదరు మేకర్స్ క్యాథరిన్ త్రెస్సా వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇది అధికారిక సమాచారం కాదు కాని ఫిలిం నగర్ లో చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ తోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు మైత్రి సంస్థ ఇంతకు ముందే ప్లాన్ చేసుకుంది. కాని పవన్ అనూహ్యంగా పాలిటిక్స్ వైపు టర్న్ కావడంతో ఇది కాస్త రవితేజను చేరుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇది విజయ్ సూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్ గా రూపొందనుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ నటించిన ఆ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సమంతా నటించగా అండర్ డాగ్ గా ఫస్ట్ హాఫ్ లో అజ్ఞాతంలో ఉండే పాత్రకు జోడిగా అమీ జాక్సన్ చేసింది. విజయ్ కూతురిగా మాజీ హీరొయిన్ మీనా గారాల పట్టి నటించి మంచి మార్కులు కొట్టేసింది కూడా. ఇప్పుడు ఆ పాప పాత్ర కోసం వేట సాగుతోంది. నిన్న కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. మొత్తం సెట్ అయితే అతి త్వరలోనే ఇది మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మైత్రి సంస్థ ప్రస్తుతం రవితేజతో రెండు సినిమాలు రెడీ చేస్తోంది. శీను వైట్ల దర్శకత్వంలో రూపొందే అమర్ అక్బర్ అంటోనీ గతంలోనే షూటింగ్ ప్రారంభించుకోగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కి రెడీ అవుతున్న సంతోష్ శ్రీనివాస్ మూవీ ఎప్పుడు మొదలుపెడతారు అనే క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి రవితేజతో చేసే ఛాన్స్ ఆ రకంగా తమన్నా మిస్ చేసుకుంది.