మాస్ పాత్రలోమిల్కీ బ్యుటీ

0Tamannahతమన్నా తెలుగులో ఎంత వేగంగా ఎదిగిందో అంటే వేగంగా డౌన్ అయిపొయింది. రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి హీరోల సరసన నటించిన తమన్నా ఇటీవల కాలంలో ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ‘ఆగడు’ సినిమాలో మాత్రమే ఆమె నటించనున్నది. ఇది కూడా ఎప్పుడో కమిట్ అయిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆమెను ఎప్పుడో బుక్ చేసుకున్నారు.

ఆమె క్రేజ్ తెలుగులో తగ్గటంతో ఓ సారి ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని కూడా తీసుకుందామని  అనుకున్నారు. ఏదేమైనా మొదటిసారిగా తమన్నా మహేష్ బాబుతో కలసి నటిస్తునందువలన ఆమెకు ఈ సినిమా కీలకం అని చెప్పొచ్చు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమన్నా తొలిసారిగా మాస్ పాత్రలో నటించనున్నది. ఈ సినిమాలో ఆమె యాస మ్యానరిజం సరికొత్తగా ఉంటుందట. దాంతో తమన్నా తన ఇమేజ్ మారిపోతుందని ఆశలు పెట్టుకుంది.