నా నువ్వే అంటూన్నా తమ్మూ రావట్లేదే?

0నయనతార లాంటి కొందరు హీరోయిన్లు సినిమా చేసిన తర్వాత ప్రమోషన్స్ కు దూరం పాటిస్తుంటారు. చందమామ లాంటి మరికొందరు అయితే ప్రచారం చేసేందుకు ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తారని.. ఎంతగా ప్రమోట్ చేస్తే అంత పేమెంట్ ఉంటుందని అంటారు.

ఇలాంటివేమీ లేకుండా తన సినిమాకు వీలైనంత వరకూ తన శక్తియుక్తుల మేరకు ప్రచారం చేసే బ్యూటీగా మిల్కీబ్యూటీ తమన్నాకు గుర్తింపు ఉంది. అయితే.. ఇప్పుడు విడుదల కానున్న నా నువ్వే చిత్రం విషయంలో మాత్రం తమన్నా ఎందుకో తప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ లాంటి మాస్ హీరో మూవీ అయినా సరే.. ముందు నుంచి ఈ చిత్రం ప్రచారం హీరోయిన్ కేంద్రంగా సాగింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోస్ లో కూడా తమన్నా అందాలపై ఫోకస్ చేసిన తీరు చూస్తే.. ఇదే సంగతి అర్ధం అవుతోంది. అయినా సరే తమన్నా మాత్రం కనిపించడం లేదు.

ప్రమోషన్స్ అంటే తనే ఉత్సాహం చూపించే తమన్నా.. నా నువ్వే విషయంలో మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో ఎవరికీ అర్ధం కావడం లేదు. నా నువ్వే మూవీ లవ్ స్టోరీ కావడంతో హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎక్కువ. అలాంటిది ఈ సినిమా విషయంలో మాత్రం మిల్కీ చిన్నచూపు చూస్తోంది. ఈ అమ్మడు కాసింత కనికరిస్తే.. సినిమాకు మేలు జరుగుతుందనే మాట వాస్తవమే.