బాహుబలి2 సీక్రెట్స్ చెప్పిన తమన్నా

0Tamanna-On-About-Baahubali-2రాజమౌళి ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలకు ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. తొలి భాగంలో తమన్నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువుంటుందని.. అనుష్కకు పెద్దగా పాత్ర ఉండదని.. రెండో భాగంలో స్టోరీ రివర్స్ అవుతుందని. దీంతో తొలి భాగంలో తమన్నాను చూసి మురిసిపోయిన ఆమె అభిమానులు.. రెండో పార్ట్ విషయంలో పెద్దగా అంచనాలతో లేరు. దీనికి తగ్గట్లే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్లో తమన్నా ఎక్కడా కనిపించలేదు. దీంతో తమన్నా పాత్ర సినిమాలో నామమాత్రం అని జనాలు ఫిక్సయిపోయారు. కానీ తమన్నా ఆ విషయాన్ని అంగీకరించట్లేదు. తన పాత్రకు కూడా ఇందులో ప్రాధాన్యం ఉందని.. ట్రైలర్ చూసి ఓ అంచనాకు రావొద్దని.. ఈ చిత్ర క్లైమాక్స్ తనమీదే తీశారని చెప్పింది.

‘‘బాహుబలి-2 ట్రైలర్ అద్భుతం. ప్రేక్షకులు పెట్టుకొన్న అన్ని అంచనాల్ని ట్రైలర్ దాటేసింది. అందుకే రెస్పాన్స్ అదిరిపోయింది. ఐతే ట్రైలర్లో నేను ఉన్నానా లేదా అనేది సమస్య కాదు. బాహుబలి-1 ప్రోమోలోనూ నా మీద ఒకే షాట్ కనిపిస్తుంది. కాబట్టి బాహుబలి-2 ట్రైలర్లో నేను లేని విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర ఏంటో వారికి అర్థమవుతుంది. బాహుబలి-2లోనూ నా పాత్ర కొనసాగుతుంది. పాత్ర పరంగా మార్పులేమీ ఉండవు. బాహుబలి-2 కోసం కూడా కత్తిసాము.. ఫైటింగ్ నేర్చుకున్నా. సినిమాకు కీలకమైన క్లైమాక్సులో నా పాత్ర కీలకం. క్లైమాక్స్ అంతా నా పైనే ఉంటుంది. ఆ సన్నివేశంలోనే నేనేంటో తెలుస్తుంది. నిజానికి బాహుబలి-1లో నాది కీలకమైన పాత్ర అయినప్పటికీ క్లైమాక్సులో నేను కనిపించదు. ఐతే బాహుబలి-2 క్లైమాక్స్ లో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేను’’ అని తమన్నా తెలిపింది’’ అని తమన్నా చెప్పింది.

బాహుబలి లాంటి సినిమాలో భాగం కావడం తన అదృష్టమని.. ఈ సినిమాతో తనకు గొప్ప పేరు వచ్చిందని తమన్నా తెలిపింది. ఈ సినిమాలో షారుక్ అతిథి పాత్రలో నటించాడనేది అవాస్తవమని.. ఈ చిత్రంలో స్పెషల్ స్పెషల్ అప్పీయరెన్స్ ఏమీ లేవని.. అలాగే రాజమౌళితో తాను గొడవ పడ్డానని వచ్చిన వార్తలు రూమర్లేనని.. ఇలాంటివి చూసి నవ్వుకున్నామని తమన్నా అంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తనకు తెలుసని.. సినిమా మొదలైన కాసేపటికే ఈ విషయం జనాలకు కూడా అర్థమైపోతుందని.. ‘బాహుబలి-2’ కోసం కథ ఏమీ మార్చలేదని తమన్నా చెప్పింది.