తమన్నా ‘బాహుబలి 3’ ముచ్చట్లు..!

0మిల్కీ బ్యూటీ తమన్నా ‘బాహుబలి’ చిత్రంతో మరింత స్టార్డంను తెచ్చుకుంటుందని అంతా భావించారు. బాహుబలి మొదటి పార్ట్‌లో తమన్నాకు మంచి స్క్రీన్ ప్రజెన్స్ దక్కింది. గ్లామర్‌తో పాటు నటనను కనబర్చే స్కోప్‌ను రాజమౌళి కల్పించాడు. బాహుబలి మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత తమన్నా తనకు వరుసగా ఆఫర్లు వస్తాయని ఆశించింది. కాని అనూహ్యంగా బాహుబలి చిత్రం తర్వాత తమన్నా తెలుగు సినిమా పరిశ్రమ నుండి మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతోంది. అడపా దడపా చిత్రాలు చేసినా కూడా పెద్దగా ఈమెకు సక్సెస్ లు దక్కలేదు. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో నటిస్తున్న తమన్నా తమిళనాట పలు చిత్రాల్లో నటిస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ‘బాహుబలి 3’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘బాహుబలి’ చిత్రాన్ని మొదట ఒకే పార్ట్‌గా తీయాలని జక్కన్న అనుకున్నారు. ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ సమయంలో సినిమా భారీ బడ్జెట్ అవ్వడం వల్ల రెండు పార్ట్‌లుగా తీయాలని నిర్ణయించుకున్నారు. మొదటి పార్ట్ విడుదల తర్వాత రెండవ పార్ట్ పై అంచనాలు భారీగా వచ్చాయి. ‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత మూడవ పార్ట్ కూడా ఉంటుందని అంతా భావించారు. రెండవ పార్ట్ ముగింపును చూస్తే మూడవ పార్ట్‌కు స్కోప్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఒకవేళ మూడవ పార్ట్ కనుక తెరకెక్కితే తమన్నాకు మళ్లీ లీడ్ రోల్ దక్కే అవకాశం ఉంది. కాని మూడవ పార్ట్ ను చేసే ఆలోచనను జక్కన్న చేసేందుకు ఆసక్తి చూపించలేదు. రెండవ పార్ట్ మంచి విజయం సాధించిందనే ఉద్దేశ్యంతో మూడవ పార్ట్ తీసి దాన్ని ప్రేక్షకుల మీద రుద్దడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే రాజమౌళి గారు బాహుబలి మూడవ పార్ట్ ఆలోచన చేయలేదని తమన్నా చెప్పుకొచ్చింది. బాహుబలి 3 లేనందుకు తనకు ఎలాంటి నిరాశ లేదని చెప్పుకొచ్చింది. బాహుబలి సైరా వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టం అంది.