అలా కవర్ చేస్తోన్న తమన్నా

0మిల్కి బ్యూటీ తమన్నా జోరు ఈమధ్య కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు తెలుగు – తమిళం రెండు భాషల్లోనూ యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వరసగా సినిమాలు చేసింది. అందమైన నవ్వు.. కావాల్సినంత గ్లామర్.. కాస్తంత నటన తెలిసిన హీరోయిన్ కావడంతో చాలా రోజులపాటు స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అయిపోయింది.

ఈమధ్య తమ్మూ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. గతేడాది తెలుగులో బాహుబలి-2లో మాత్రమే కనిపించింది. పేరుకు అందులో హీరోయిన్ అయినా కామియో రోల్ తో సమానం. రేసులో వెనుకబడటం గురించి తమన్నా వద్ద ప్రస్తావిస్తే తనకేం ఆఫర్లు తగ్గలేదని.. తానే సినిమాలు చేయడం తగ్గించుకున్నానంటూ కవర్ చేస్తోంది. కొన్నేళ్లగా పగలు రాత్రి తేడా లేకుండా చేసిన షూటింగులతో అలిసిపోయానని… పరుగు తీయడం కాస్త తగ్గించాలనే అన్ని ఆఫర్లను ఓకే చేయడం లేదంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన నా నువ్వే సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మెగా స్టార్ 151వ సినిమాలోనూ తమ్మూ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఇది కాక క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మిలోనూ నటిస్తోంది. వీటిలో దటీజ్ మహాలక్ష్మి ఎప్పుడో మొదలెట్టింది. సైరాలో ఆమెది మెయిన్ రోల్ కాదు. ఆమెకు ఇప్పుడు ఆఫర్లు లేవనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంటే అలిసిపోయానంటూ బాగానే కవర్ చేసుకొస్తోంది.